రామగిరి (విజయక్రాంతి): రామగిరి మండలంలోని ఆదివారంపేట భూములలో నేషనల్ హైవే పనులను గురువారం రైతులు అడ్డుకున్నారు. నేషనల్ హైవే పనులు త్వరలో ప్రారంభం అవుతున్న క్రమంలో ట్రెంచ్ కొట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలతో రామగిరి తహసిల్దార్ బోర్కరి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆర్ ఐలు కే మహేష్, రవిశంకర్ లు రామగిరి పోలీసులు వెళ్లగా రైతులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం వచ్చే వరకు పనులు జరగనివ్వమని రైతులు హెచ్చరించారు.