calender_icon.png 5 March, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిఖని గని 2 లాంగ్ వాల్ ప్రాజెక్టును నిరసిస్తూ రైతుల బైక్ ర్యాలీ

04-03-2025 10:21:24 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖని గని -2 లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణ పనులను నిరసిస్తూ మంగళవారం రాత్రి పెరిక పల్లి గ్రామంలో నిర్వాసిత రైతులు నిరసన తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం గతంలో నిర్వాసిత గ్రామాలలో చేసింది ఏమి లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏర్పాటు సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. లాంగ్ వాల్ -2 ప్రాజెక్టు విస్తరణ కోసం తీరని హామీలు ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారని, దీనిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నిర్వాసిత గ్రామాల ప్రజలందరూ ఈనెల 6 న బెల్లంపల్లి శాంతిఖని గని ఆవరణలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణకు తరలివచ్చి నిరసన తో ప్రాజెక్టును అడ్డుకోవాలని వాడవాడలా తిరిగి ప్రచారం చేశారు.బట్వాన్ పల్లి, పెరిక పల్లి గ్రామాల రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.