calender_icon.png 12 January, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనాల్ పూడికతీతతో రైతులకు ఎంతో మేలు

12-01-2025 04:48:36 PM

మంత్రి శ్రీధర్ బాబుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు... 

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్

మంథని (విజయక్రాంతి): కెనాల్ పూడికతీతతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ తెలిపారు. ఆదివారం సింగరేణి అధికారులతో కలిసి కెనాల్ లో పుడికతీత పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. మంథని, రామగిరి మండలాలలోని పుట్టపాక, చల్లపల్లి, రామయ్య పల్లె, నగరంపల్లి, సిద్దపల్లి, అక్కేపల్లి, వేంపాడు గ్రామల  రైతులు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పొలాలకు ప్రధానమైన జీవనధార ఎల్-83 కాలువ కొంతకాలంగా పిచ్చి చెట్లతో, వర్షాకాలం మట్టితో నిండడం వల్ల నీరు కింది రైతులకు అందడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ద్రుష్టికి తీసుకవెళ్ళామని,  వెంటనే స్పందించిన మంత్రి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి కాల్వ పూడిక పనులను త్వరగా చేపట్టాలని సింగరేణి అధికారులను ఆదేశించారని ప్రసాద్ తెలిపారు. దీంతో ఆదివారం సింగరేణి అధికారులు ఎల్-83 కాలువ పరిశీలించి పూటిక తీసివేసే ప్రక్రియ ప్రారంభించారని, కాలువ పూడిక తీతతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, మంత్రి శ్రీధర్ బాబుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఐలి ప్రసాద్ తెలిపారు.