calender_icon.png 5 December, 2024 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే రైతులకు లబ్ధి

08-10-2024 12:35:14 AM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గంగారెడ్డి ప్రమాణం

నిజామాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు లబ్ధి చేకూరుతుందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ముప్ప గంగారెడ్డి సోమవారం ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, సుదర్శన్‌రెడ్డిల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

వైస్ చైర్మన్‌గా జంగిటి రాంచందర్‌తో పాటు డైరెక్టర్లుగా అయిల రాజలింగం, యెన్నం బాగారెడ్డి, దండ్ల రాజ న్న, మెగావత్ మంగిత్య, గ్యానాజి గంగారెడ్డి, వంగ దేవకరుణ, పెంట  ఇంద్రుడు, సాయినేని వెంకటేశ్వరరావు, కౌడపు రఘువీర్, మహ్మద్ ఈసా, జంగిటి మల్లేష్, ఎలిగేటి నరేంధర్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంతో ముందుంటుం దన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ మార్కెట్ యా ర్డును మరింత అభివృద్ధి చేయాలన్నారు. నూతన చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. ఒక రైతు బిడ్డగా తనకు రైతుల సమ స్యలు తెలుసని, యార్డులో రైతులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్‌నాయక్, నగర పార్టీ అధ్యక్షుడు కేశ వేణు పాల్గొన్నారు.