calender_icon.png 25 April, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతితో రైతులకు ప్రయోజనం

25-04-2025 02:41:05 AM

చారకొండ, ఏప్రిల్ 24 : పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి భూ యాజమాన్య హక్కులు కాపాడేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని జిల్లా ఆదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. గురువారం చారకొండ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ధరణి పోర్టల్లో పరిష్కారం కాని అనేక సమస్యలను భూ భారతి చట్టం పరిష్కరిస్తుందని, జిల్లా లెవల్ లో కూడా అప్పీల్కు అవకాశాలున్నాయన్నారు.

ప్రతి ఒక్కరికి భూదార్ కార్డులు అందిస్తామన్నారు. సాదాబైనామా సమస్యలు, అసైన్డ్ భూముల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సింగిల్ విండో చైర్మన్ గురువయ్య గౌడ్, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దారు సునీత, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఏఓ తనూజ, నాయకులు వెంకట్ గౌడ్, బలరాం గౌడ్, జైపాల్, శివ తదితరులు పాల్గొన్నారు.