calender_icon.png 26 April, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో రైతులకు మేలు

25-04-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం అసిఫాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం  కెరమెరి మండలం కేస్లగూడ గ్రామంలోని రైతు వేదికలో భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఉమ్మడి ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్,  ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా ప్రారంభించిన భూభారతి నూతన చట్టం లో పొందుపరిచిన అంశాలు రైతుల సమస్యల పరిష్కారానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.

భూమి అనేది ఒక రైతు జీవితానికి చాలా పెద్ద ఆధారమని, ముఖ్యంగా భూభారతి చట్టంలో అప్పిలు వ్యవస్థ చాలా కీలకమైనదని అన్నారు. రైతుకు అన్యాయం జరిగితే ఆప్పిల్ చేసుకోవడం ద్వారా న్యాయాన్ని పొందవచ్చని, ఆర్డీవో, జిల్లా కలెక్టర్, సిసిఎల్‌ఎ స్థాయిలలో అప్పిలు చేసు కోవచ్చని తెలిపారు. గ్రామాలలో చాలావరకు భూమి హద్దుల గొడవలు ఉంటాయని, కానీ భూ భారతిలో రీ సర్వే, కొనుగోలు, పాలు పంపకాలు, దాన దస్తావేజులు, విరాసత్ పట్టా మార్పిడికి తప్పనిసరిగా జతపర చడం వల్ల భవిష్యత్తులో భూ గొడవలు ఉండవని తెలిపారు.

భూభారతి చట్టంలో బాధితులకు న్యాయ సలహా వ్యవస్థ ఉందని, గతంలో గ్రామాలలో గ్రామ పరిపాలన, వి ఆర్ ఓ / వి.ఆర్.ఏ వ్యవస్థ ఉండేవని, వాటిని తొలగించడం ద్వారా గ్రామాలలో సమస్యలపై సమాచారం లేదని తెలిపారు. ప్రతి రైతు భూభార తి చట్టంలోని అంశాల పట్ల అవగాహన చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనా రాయణ, తహసీల్దార్ దత్తు ప్రసాద్, మండ ల పరిషత్ అభివృద్ధి అధికారి అంజద్ పాషా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.