calender_icon.png 29 April, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం శుభ్రత యంత్రంపై రైతులకు అవగాహన

28-04-2025 08:41:50 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని రైతులకు ఆటోమాటిక్ వరి శుభ్రత యంత్రం వాడే విధానం తద్వార కలిగే ప్రయోజనాలపై రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. మండలంలోని సారంగపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి మాట్లాడారు. ఆటొమాటిక్ వరి క్లీనర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, లక్షేట్టిపెట్ ద్వారా మండలానికి మంజూరు అయిందని ఈ యంత్రంనుపయోగించి ఒక గంట వ్యవధిలో ఒక ఎకరా పొలంలో పండిన ధాన్యాన్ని శుభ్రపరచుకోవచ్చని, యంత్రానికి అమర్చబడిన పొడవాటి పైప్ ను ధాన్యం కుప్ప వద్ద ఉంచినప్పుడు విద్యుత్ మోటార్ ద్వారా యంత్రం పని చేసి ఫ్యాన్ ద్వారా జాలీల నుండి నాణ్యమైన ధాన్యం ప్రత్యేకంగా వేరు చేయబడి అందులో నుండి తాలు, తప్ప, రాళ్లు, రప్పలు, మట్టి పెల్లలు, వరి గడ్డి వంటివి ప్రత్యేక మార్గం ద్వారా బయటికి వస్తాయని ఆన్నారు.

ఈ యంత్రంనుపయోగించి శుభ్రపరచిన వరి ధాన్యం నాణ్యమైనదిగా ఉండడం వలన కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఉండవని, తూకంలో హెచ్చు తగ్గులు లేకుండా ధాన్యాన్ని కోనుగోలు కేంద్రం వారు కొనుగోలు చేస్తారని తెలిపారు. కావున రైతులందరు ఈ యంత్రాన్ని వినియోగించుకొని నాణ్యమైన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించడంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కనకరాజు, వరి కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ రాయమల్లు, రైతులు ఫిరోజ్, మధునయ్య, గౌస్, ఐలయ్యలు పాల్గొన్నారు.