హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, తహశీల్దార్ కారుపై రాళ్లు విసిరారు. రైతుల రాళ్ల దాడిలో కలెక్టర్, తహశీల్దార్ కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా కలెక్టర్ రైతులతో చర్చలకు వచ్చారు. అధికారులు లగచర్లకు 2. కిలో మీటర్ల దూరంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఊరి బయట చర్చలకు ఏర్పాట్లు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో చర్చల కోసం రైతులు గ్రామసభ వద్దకు రాలేదు. కలెక్టర్ గ్రామసభ వద్ద ఉన్న ఇద్దరు రైతులు అభ్యంతరంతో లగచర్ల గ్రామంలోనే రైతులతో చర్చించేందుకు వెళ్లారు. కలెక్టర్ లగచర్ల గ్రామానికి రాగానే రైతులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనక్కు వెళ్లిపోవాలంటూ కారుపై రైతులు రాళ్లు విసిరారు. దీంతో కలెక్టర్ కారు దిగి రైతులతో చర్చించేందుకు వచ్చారు.