- నాగమడుగు, లెండి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం
- నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- నిజాంసాగర్ నుంచి నీటి విడుదల
- కామారెడ్డి, డిసెంబర్ 13 (విజయక్రాంతి): సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి సాగు కోసం నీటిని మంత్రి విడుదల చేశారు. అనంతరం నిజాంసాగర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు.
- ఉమ్మడి జిల్లా రైతులకు యాసంగిసాగు కోసం లక్ష 25 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న నాగమడుగు, లెండి ప్రాజెక్ట్‌ల పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్ లెండి నిర్మాణం పూర్తి కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
- దేశంలోనే ఈసారి తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగయిందని, కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడుకోలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభమైందన్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో నీటి పారుదల రంగం, ప్రాజెక్ట్‌లపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని తెలియజేశారు.
చెక్కు చెదరని నిజాంసాగర్
లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ట్ కుంగిపోయిందని, వందేళ్ల పైబడిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ చెక్కు చెదరకుండా ధృడంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లు నీటి పారుదల రంగంలో భారీ అవినీతి అక్రమాలు చేసి నష్టం చేకూర్చిందన్నారు.
ఆయా కార్యక్రమల్లో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, కలెక్టర్ ఆశిష్‌సంగ్వాన్, బాన్సువాడ అదనపు కలెక్టర్ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
మంత్రి రాకతో సీనియర్ నాయకుల అరెస్ట్
కామారెడ్డి జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న జుక్కల్, బాన్సువాడ, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అసమ్మతి నేతలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిజాంసాగర్‌లో నీటి విడుదలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వస్తున్నందను ముందస్తుగా పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేతలను అరెస్ట్ చేశారు.
ఎన్నికల్లో తోట లక్ష్మీకాంతారావును జుక్కల్ ప్రజలకు పరిచయం చేసి, తన భుజాలపై మోసి, ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సంవత్సర కాలంలోనే తనపై కక్షసాధింపు చర్యలతో సొంత పార్టీ నేతలు అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని అరెస్టుయిన నేతలు మండిపడ్డారు.
వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు నీరు
నిజామాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందజేస్తామని, శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌కు పూర్వ వైభ వం తెస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని ఎ స్సారెస్సీ ప్రాజెక్ట్‌ను మంత్రి సందర్శించారు.
ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, లక్ష్మీకాంతా రావు, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, కలెక్ట ర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో సమీ క్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ ను సమర్థవంతంగా చేపట్టాలన్నా రు. ప్రాణిహిత చేవేళ్ల 21వ ప్యాకేజీ అసంపూర్తి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ త హెర్‌బీన్ హుందాన్ పాల్గొన్నారు.