calender_icon.png 21 February, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతు సంఘం ఆందోళన

18-02-2025 11:23:38 AM

ఖమ్మం(విజయక్రాంతి): ఖమ్మం మిర్చి మార్కెట్(Khammam Chilli Market)లో రైతు సంఘం(Farmers Association) ఆందోళన చేస్తుంది. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేస్తున్నారు. ఈ ధర్నలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు హేమంతరావు(Farmers' Association State President Hemantha Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది క్వింటా మిర్చికి రూ.20 వేల నుంచి రూ.25 వేల ధర పలికితే ఇప్పడు అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉండడంతో రైతులకు ఎనలేని నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా  మిర్చికి క్వింటాకు రూ.25000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. జెండా పాట కంటే తక్కువ ధరతోనే మిర్చిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.