ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో సాగునీరందక ఎండలకు పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి సాగర్ జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం కల్లూరు మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న రైతులను, రైతు సంఘం నాయకులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం లో రైతు సంఘం అధ్యక్షుడు మాధినేని రమేష్‌ను, కల్లూరు మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు ను, పలువురు రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు.అరెస్టులను రైతు సంఘం ఖండించింది.