calender_icon.png 18 March, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు కష్టాలు

17-03-2025 01:53:35 AM

 బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి

నల్లగొండ, మార్చి 16 (విజయక్రాంతి) :  కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి విమర్శించారు. దేవరకొండలో ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు వస్కుల సుధాకర్తో కలిసి ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తుండడంతో పొలాలు ఎండి అన్నదాతలు అప్పుల పాలయ్యే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకం తెస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆక్షేపించారు.

పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చింది? అని ప్రశ్నించే మేధావులకు నిన్న అసెంబ్లీలో సీఎం ప్రస్తావించిన అంశాలు చెంపపెట్టులాంటివన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతావత్ లాలూనాయక్, కర్నాటి సురేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెనముని రాములు, అసెంబ్లీ కన్వీనర్ ఏటీ కృష్ణ, బిజెపి సీనియర్ నాయకులు నక్క వెంకటేశ్యాదవ్, అంకురి నరసింహ, నేతాల వెంకటేశ్, గుండాల అంజయ్య, జల్ద భాస్కర్, సముద్రాల సహదేవుడు, ఇడం రవి, గంజి హరి, అర్థం రమేశ్, అజయ్ పాల్గొన్నారు.