మంథని, డిసెంబర్ 23(విజయక్రాంతి): ఎస్సాఆర్‌ఎస్పీ కెనాల్ లో షీల్టుతీతతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని, మం త్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సీతంపేట లో ఆర్‌ఎస్బీ, డీ83 ఎస్సాఆర్‌ఎస్పీ కెనాల్ పరిశీలనలో మంథని ఐబి డీఈ రమేష్ బాబు అన్నారు. సోమవారం ముత్తారం మండలం లోని డీ సీతంపేట కెనాలను ఆయన కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేం దర్ రెడ్డి, సింగరేణి అధికారి శ్రీనివాస్ తో కలిసి కెనాల్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందు కు కెనాల్ పూర్తిగా తుంగ, పిచ్చి మొక్కలతో నిండిపోయిందని, దీంతో సాగునీరు చివరి ఆయకట్టు వరకు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు మంథని, ముత్తారం మండలంలోని చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ కెనాల్ పూడిక తీత పనులు ప్రారంభించేందుకు కెనాలను పరిశీలిస్తున్నామన్నారు.
త్వరలోనే షిల్టు తీసే పనులు ప్రారంభిస్తామన్నారు. వారి వెంట ఏఈఈ రఫీ, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్, లస్కర్ ప్రభాకర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.