ఇల్లెందు (విజయక్రాంతి): టేకులపల్లి మండలం 9వ మైలుతండాలో కృషి విజ్ఞాన కేంద్రము, వ్యవసాయ శాఖ సంయుక్తముగా రైతులకు మునగ, పామ్ ఆయిల్, కూరగాయల సాగుపై మంగళవారం అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమములో రైతుకు లాభదాయకమైన, మేళుకువలు యాజమాన్య పద్దతులు, తక్కవ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విదంగా పలు సలహాలు, సూచనలు, మార్కెట్ లో డిమాండ్ వున్న పంటలు పండియడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కెవి కె ప్రోగ్రాం కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణమ్మ, ఇల్లందు డివిజన్ ఏడిఏ లాల్ చంద్, శాస్త్రవేత్త బి. శివ, మండల వ్యవసాయాదికారి అన్నపూర్ణ పాల్గొని పలు క్షేత్రాలు సంయుక్తంగా సందర్శించి సలహలు సూచనలు రైతులకు తెలిపారు.