టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చంద్రు తండా, రాజు తండా గ్రామానికి చెందిన రైతులు మొక్కజొన్న సాగుచేసి నష్టపోయామని, నష్టపరిహారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం... లక్కినేని సురేందర్ రావు అనే వ్యక్తి దగ్గర నుండి రాజు తండా, చంద్రు తండా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు మొక్కజొన్న పంట సాగు చేసుకోవాలని సూచించడంతో తాము మొక్కజొన్న పంటను వేశామని, మొక్కజొన్న కంపెనీ డీలర్ ఫీల్డ్ కి వచ్చి మీరు మొక్కజొన్న ఆడ మగ అనే మొక్కజొన్న పంటను మిట్ట భూములలో మాత్రమే వేయాలని పొలంలో వేస్తే అవి మొలకెత్తవని మొలకెత్తిన అవి దిగుబడి రావని తెలపడంతో పొలంలో వేసిన మొక్కజొన్న చేనును దున్నేశామన్నారు. దీంతో మొక్కజొన్న పంట సాగు చేసి నష్టపోయామని తెలిపారు.
ఈ మొక్కజొన్న గింజలను సరఫరా చేసిన వ్యక్తిని ఆశ్రయించడంతో, గ్రామoలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగిందని, ఆ పంచాయతీలో రైతులాంతాఎకరానికి రూ20వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశామన్నారు. రైతుల డిమాండ్ మేరకు మీకు వారం లోగా నష్టపరిహారం చెల్లిస్తామని సబ్ డీలర్ అయిన లక్కినేని సురేందర్ రావు హామీ ఇవ్వడంతో తమడిమాండ్ ని విరమించుకున్నాం. ఇచ్చిన హామీ మేరకు అనుకున్న సమయంలో మాకు నష్టపరిహారం రాకపోవడంతో పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు. హనుమకొండకు చెందిన రవీందర్ రెడ్డి డీలర్ ను వివరణ కోరగా.. విత్తనాల విషయంలో పేగులపల్లి మండలంకు మాకు ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ పరిచయస్తులు కూడా లేరని, సీతారాంపురం గ్రామంలో రాములు అనే వ్యక్తి ద్వారా లక్కినేని సురేందర్ రావు పరిచయం అయ్యాడని తెలిపారు. అయితే సురేందర్రావును కలిసి మాట్లాడడంతో మా దగ్గర నుండి కమిషన్ ఎకరానికి రూ5 00 చొప్పున ఇవ్వాలని ఆయన కోరగా దానికి తాము అంగీకరించలేదని మేము రూ200 కమిషన్ మాత్రమే ఇస్తామని ఫైనల్ గా రూ 300 కమిషన్ను ఇచ్చేటట్లు అగ్రిమెంట్ చేసుకుందామని తెలిపారు.
ఇందులో భాగంగానే మా దగ్గర నుండి రూ17 లక్షల లక్కినేని సురేందర్ రావుకు కరెంట్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని తెలిపారు. రైతుల నష్టపోయిన పంటకు సబ్ డీలర్ అయిన లక్కీనేనీ సురేందర్ రావే బాధ్యత అని మాకు, మా కంపెనీకి ఎటువంటి బాధ్యత లేదని తాము నేరుగా రైతులకి ఎటువంటి విత్తనాలు ఇవ్వలేదని తెలిపారు. సబ్ డీలర్ అయిన లక్కినేని సురేందర్ రావే దీనికి పూర్తి బాధ్యతగా వహిస్తూ రైతులకు నష్టపరిహారం ఆయనే చెల్లిస్తాడని కంపెనీ డీలర్ రవీందర్ రెడ్డి తెలిపారు. మేము రైతులకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రైతుకి ఎకరానికి రూ50 వేల పెట్టుబడి సాయానికి గడ్డి మందు, పురుగుమందు పిచికారి కోసం మేము రైతులకు ఇస్తామని అందులో భాగంగానే రైతులకు విత్తనాలు ఇచ్చే ముందు రైతులు మొక్కజొన్న ఆడ మగ పంటలను మెట్ట భూములను మాత్రమే వేయాలని పొలంలో వేయకూడదని రైతులకు సూచించడం కూడా జరిగిందని తెలిపారు. టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్ వివరాల ప్రకారం.. రైతులను మోసం చేసే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, రైతులు కూడా వ్యవసాయ శాఖ అనుమతులు తీసుకునే విత్తనాలు నాటుకోవాలని అన్నారు.