- భైంసా-నిర్మల్ రహదారి దిగ్బంధం
- పురుగుల మందు డబ్బాలతో మహిళా రైతులు
నిర్మల్, నవంబర్ 26 (విజయక్రాంతి): ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి రైతుల ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్‌లో చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది.
తమ పంటపొలాలకు, ప్రాణాలకు ముప్పు కలిగించే ఇథనాల్ పరిశ్రమను నిర్మించవద్దని ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై రైతులు భగ్గుమన్నారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయా లని డింమాండ్ చేస్తూ నాలుగు గ్రామాల రైతులు జేఏసీ ఆధ్వర్యంలో భైంసా జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.
దిలువార్‌పూర్, టెంబర్ని, గుండంపల్లి, రత్నాపూర్ కాండ్లీ గ్రామల రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దిలువార్‌పూర్ మండల కేంద్రం వద్ద 6 గంటలపాటు రాస్తారోకో చేశారు. మహిళా రైతులు పరుగుల మందు డబ్బాలు పట్టుకుని బైఠాయిం చారు. పోలీసులు, అధికారులు చర్చలు జరిపినా వినలేదు.
ఫ్యాక్టరీని రద్దు చేస్తామని ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని చెప్పడంతో అధికారులు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలకు విన్నవించారు. తమకు న్యాయం చేయ్యని అధికారులపై నమ్మకం లేదని ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తమను జైలుకు పంపినా వెనుకడుగు వేయబోమని హెచ్చరించారు.
నిర్మల్‌ను రాజకీయంగా వాడు కుంటున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కనిపించడం లేదని ఫ్లెక్సీలు పెట్టి నిరసన తెలిపారు. త్వరలో వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాస్తారోకో కారణంగా జాతీ య రహదారిపై కిలో మీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు వాహ నాలను కలూర్ కుంటాల సారంగపూర్ మీదుగా నిర్మల్‌కు మళ్లించారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ప్రదేశంలో పోలీసులు బలగాలు భద్రత ఏర్పాటు చేశాయి. అక్కడికి వెళ్లే దారులను మూసివేసి పహారా కాశాయి.
కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన రాత్రి 10 గంటలైనా రైతులు విరమించ లేదు. రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. చలిమంటలు వేసుకొని రోడ్డుపైనే బైఠాయించారు. రైతుల చర్చల కోసం వచ్చిన నిర్మల్ ఆర్డివో రత్నా కళ్యాణి వాహనాన్ని ఆరు గంటలపాటు దిగ్బంధం చేశారు. దీంతో కారులోనే ఆర్డీవో కారులోనే ఉండిపోయారు.
దీంతో ఆరోగ్యం క్షీణించడంతో పోలీసుల బందోబస్తు మధ్య నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు భీష్మించుక్కూర్చున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఆఫీసుకు నివేదికను పంపినట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ నేప థ్యంలో రైతులు ఆందోళన విరమించారు.