calender_icon.png 31 March, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ డోకాపై రైతన్న ఆగ్రహం..

21-03-2025 01:36:05 AM

జగిత్యాల అర్బన్, మార్చి 20(విజయ క్రాంతి): పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతన్నలను ప్రభుత్వం మోసం చేసిందని, రైతన్నల సమస్యల పరిష్కారం కోసం  ఈ నెల 24న తలపెట్టిన రైతన్నల చలో అసెంబ్లీ’ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా నాయకులు భంద్దెల మల్లయ్య, నేరెళ్ల భూమరెడ్డి, 

ఏలేటి నరసింహారెడ్డి,  పిలుపునిచ్చారు, గురువారం కొడిమ్యాల మండల కేంద్రం లోని అంగడి బజార్లో  రైతులతో  మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అంటూ మాటలు చెబుతూ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతాంగం ఎదుర్కొంటున్న పసుపు కు మద్దతు ధర,వందశాతం రుణమాఫీ అమలు,రైతు భరోసా అమలు లాంటి రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికై  పార్టీలకతీతంగా రైతులు చలో అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..

ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో ఈనెల 24న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టామని దీనిని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా నాయకులు నేరెళ్ల భూమరెడ్డి, మల్లయ్య, మండల రైతు ఐక్యవేదిక నాయకు,లు ఏలేటి నరసింహారెడ్డి, చల్ల శ్రీనివాసరెడ్డి, సాగర్రావు ,ప్రమోదరావు అక్కన పెళ్లి నరేష్ తదితరులున్నారు.