calender_icon.png 24 October, 2024 | 12:56 PM

Breaking News

రైతాంగ, ప్రజా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

24-10-2024 10:41:48 AM

వనపర్తి (విజయక్రాంతి) : ఈ నెల 29 వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతాంగ, ప్రజా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గ్రంధాలయ మాజీ చైర్మన్ లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ లు అన్నారు. జిల్లా కేంద్రంలోని 19వ వార్డు వాటర్ ట్యాంక్ వద్ద 17,18,19,20 వార్డుల ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశం లో వారు మాట్లాడారు.

ఈ నెల 29 వ తేదీన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతాంగ, ప్రజా నిరసన కార్యక్రమం ను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిధిగా హాజరు అవుతారన్నారు.  ఎన్నికలో భాగంగా తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే 100 రోజులోనే అమలు చేస్తామని చెప్పి తీరా అధికారం లోకి 10 నెలలు గడుస్తున్న నేటికీ అమలు చేయడం లో విఫలం అయ్యారన్నారు.  ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ 15 వేలు ఇస్తామని, కొనుగోలు కేంద్రాలలో రూ 500 బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసారని బోనస్ సంగతి దేవుడు ఎరుగు రైతులు ఇబ్బంది పడకుండా ఇచ్చే రైతు భరోసా కూడా ఇవ్వడం లేదన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వం లో పింఛన్ రెండు వేలు ఇస్తున్నారు రెండు నెలలో కె సి ఆర్ ప్రభుత్వం ను పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కు అధికారం ఇస్తే రూ 4 వేలు పింఛన్ ఇస్తామని వేలు చూపిస్తూ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు మరి అధికారం లోకి వచ్చి 10 నెలలు అవుతున్న ఇంత వరకు రూ 4 వేలు పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని మసి పూసి మారేడు చేయడం ముఖ్యమంత్రి వెన్న తో పెట్టిన విద్య అని వారు ఎద్దేవా చేశారు. 

గర్భిణీ స్త్రీలకు పౌస్టికారాహాన్ని అందించాలని ఉద్దేశ్యం తో న్యూట్రిషన్ కిట్లు, ప్రసవ అనంతరం బాలింతలు పుట్టిన బిడ్డ కోసం కేసిఆర్ కిట్ లను అందచేసిందని గత ప్రభుత్వం అందిస్తున్న కిట్లలో మిగిలి ఉన్న కిట్లకు ఎం సి హెచ్ కిట్లు అని పేరు పెట్టి పంపిణి చేసి దాదాపు సంవత్సర కాలం నుండి ఎంసి హెచ్ కిట్లకు మంగళం పలికారన్నారు.  ఇలా మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ  రైతులు, ప్రజల పక్షాన ఎప్పుడు బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతూనే ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆయా వార్డు ల నాయకులు తదితరులు పాల్గొన్నారు