21-02-2025 12:48:07 AM
మంథని, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మంథని లో తహసిల్దారు లేక రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నరని, వెంటనే తాసిల్దారు నియమించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో కార్యాలయంలో డిటి సురేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జరిగిన తహసిల్దార్ల బదిలీ ప్రక్రియలో మంథని తాసిల్దార్ రాజయ్య బదిలీపై వెళ్ళినారని, 20 రోజులు గడుస్తున్న మంథని కి తాసిల్దార్ రావటం లేదని అవేధన వ్యక్తం చేశారు.
తాసిల్దార్ లేకపోవడంతో కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లు, రైతుల ధరణి సమస్యలు, మాటిగేషన్ రుణాలు మరియు కల్యాణ లక్ష్మి దరఖాస్తు విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మంథని కి పూర్తిస్థాయిలో తాసిల్దార్ ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాబు రవి, ఇరుగురాల ప్రసాద్, ముత్యాల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.