calender_icon.png 28 November, 2024 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా విజయోత్సవ సభకు తరలిన రైతులు, నాయకులు

28-11-2024 01:02:34 PM

రాజాపూర్, విజయక్రాంతి: ప్రజాప్రభుత్వ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతుల కార్యక్రమం బహిరంగ సభలా కాకుండా వారికి అవగాహన కల్పించే రైతు సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశించారని కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ మండల అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య యాదవ్ అన్నారు. ఈ విజయోత్సవ సభలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలపై అవగాహన కల్పించే లక్ష్యంగా  వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం రాజాపూర్ మండలం నుంచి పలువురు రైతులను ఈ రైతు అవగాహన సదస్సుకు తీసుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఖానాపూర్ శేఖర్ గౌడ్, గోనెల రమేష్, నజీర్ బేగ్, మల్లెపల్లి అశోక్, శ్యాంసుందర్ రెడ్డి, ఖానాపూర్ మైపాల్ రెడ్డి,  కుమ్మరి వెంకటయ్య, వెంకటయ్య, మల్లేష్, చెన్నయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు రైతులు ఉన్నారు.