calender_icon.png 10 January, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామ జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల ఆందోళన

09-01-2025 10:32:48 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ మండలంలోని రేపల్లె వాడలో గల శ్రీరామ పత్తి జిన్నింగ్ మిల్లు వద్ద గురువారం సాయంత్రం రైతులు ఆందోళన చేపట్టారు. సిసిఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు సిబ్బందితో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారీల పత్తిబళ్లను అనుమతిస్తూ రైతులన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో రోజుల తరబడి అనుమతి లభించక జిన్నింగ్ మిల్లు వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిన్నింగ్ మిల్లు సిబ్బంది నిర్వాకంపై సంబంధిత అధికారులకు విన్నవించుకుందామంటే వారు అందుబాటులో ఉండడం లేదని వాపోయారు. జిన్నింగ్ మిల్లు యాజమానులు, సిబ్బంది కూడా పత్తి రైతులకు సరైన సమాధానం చెప్పకపోవడంతో కొద్దిసేపు శ్రీరామ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా రైతులు సహనం కోల్పోయి జిన్నింగ్ మిల్లు నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేయడం పత్తి కొనుగోళ్ళ విషయంలో అనుమానాలను రేకిత్తిస్తోంది.