calender_icon.png 3 March, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు-2ను విరమించుకోవాలని కలెక్టర్ కు వినతి

03-03-2025 03:45:39 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ప్రతిపాదించిన బెల్లంపల్లి శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్-2ను విరమించుకోవాలని కోరుతూ సోమవారం ప్రభావిత ఆకెనపల్లి, లింగాపూర్, బట్వాన్ పల్లి, పాత బెల్లంపల్లి, బుచ్చయ్యపల్లి గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ను స్వయంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రభావిత గ్రామాల్లో త్రాగునీటి సమస్య జటిలంగా మారుతుందని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈనెల 6న శాంతిఖని గని ఆవరణలో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.

బెల్లంపల్లి శాంతిఖని గని వద్ద నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేసి ప్రభావిత గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించాలని వినతి పత్రంలో కలెక్టర్ ను కోరారు. సింగరేణి ప్రతిపాదిత శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ -2ను వ్యతిరేకిస్తూ ప్రభావిత గ్రామాల రైతులు తీర్మానం చేయనున్నట్లు వారు వినతి పత్రంలో స్పష్టం చేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో రైతులు సంగతి సత్యనారాయణ, సింగతి కిరణ్, చింతం స్వామి, ఆకిరెడ్డి శంకర్, రామగొని అశోక్ గౌడ్ ,రాయలింగు తో పాటు ప్రభావిత గ్రామాల కు చెందిన 50 మంది రైతులు, యువకులు ఉన్నారు.