రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రైతుల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడివుందని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని నాగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన సన్న ధాన్యానికి రూ. 500/- బోనస్, ఒకే దఫా రూ 2 లక్షల రుణమాఫీ రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభ్యుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. రైతు భరోసా, రైతు భీమా వంటి పథకాలు చేపట్టి రైతు సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చాటుతుందన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు, కాంగ్రెస్ నాయకులు వై.వెంకటేశ్వర్లు, కొండం పుల్లయ్య, గంగుల వెంకటేశ్వరరెడ్డి, గంధం నరసింహారావు, పర్వా సురేందర్ రెడ్డి, పాకాలపాటి రోశయ్య చౌదరి, రావులపల్లి కొండయ్య, అప్పోజు సత్యనారాయణ, రాంబాబు, జారె బాబు, వీరయ్య, ఎలీనా తదితరులు పాల్గొన్నారు.