మెదక్: జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో రాజయ్య (50) అనే రైతు తన సొంత భూమి ఎకరం సాగు చేసుకుంటూ కూలినాలి చేసుకుంటూ ఇల్లు కట్టుకున్నాడు. కొడుకు చెయ్యి విరగడంతో ఆస్పత్రి ఇంటి ఖర్చులు పంట పొలానికి అప్పులు భారంగా దాంతో బతుకుదెరువు కోసం ఆర్మూర్ ప్రాంతానికి కుటుంబంతో తిరిగి గ్రామానికి వచ్చిన ఉన్న లావాని పట్టా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ తరుణంలో అప్పులు అధికంగా ఉండడంతో అప్పుల బాధ భరించలేక జీవితంపై విరక్తి చెంది చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుని శవాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి కుమారుడు సాయికుమార్ కూతురు శృతి ఇద్దరు ఉన్నారు. భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై బాలరాజ్ విలేకర్లకు తెలిపారు.