కామారెడ్డి: జిల్లాలోని పెద్ద కొడపగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వడ్లం గ్రామానికి చెందిన అంజయ్య అనే రైతు గత కొన్ని నెలల క్రితం పట్టాదారు పాసు పుస్తకం కోసం అర్ఐ పండరికి 20 వేల నగదును అందించాడు.
రైతు ఆర్ఐ పండరిని తన పట్టాదారు పాసుపుస్తకం అడిగితే ఈరోజు రేపు అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో విసుకు చెందిన అంజయ్య ఇవాళ ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంజయ్యను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం పెద్ద కొడపగల్ ఆసుపత్రికి తరలించారు. రైతును చూసిన వైద్యులు అతని అత్యవసరంగా మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.