calender_icon.png 11 January, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్వో ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం

02-08-2024 12:37:59 AM

నల్లగొండ, ఆగస్టు 1 (విజయక్రాంతి): రెవెన్యూ అధికారులు తన తోటలోని బోరును సీజ్ చేశారని గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. గుర్రంపోడు మండలం తేరాటిగూడేనికి చెందిన కసిరెడ్డి చిన్న మల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి సోదరులు. ఇటీవల మల్లారెడ్డి తన తోటలో బోరు వేశాడు. పొత్తులో ఉన్న పాత బోరు సమీపంలోనే వేశాడని రామకృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ బోరును సీజ్ చేశారు. ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన మల్లారెడ్డి అకారణంగా బోరును సీజ్ చేశారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.