తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ
గద్వాల (వనపర్తి), అక్టోబర్ 14 (విజయక్రాంతి): గద్వాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయిజ మండలం గుడుదొడ్డి గ్రామానికి చెం దిన రైతు పరశురాముడు తన వ్యవసాయ భూమిని అయిజ తహసీల్దార్ ఇతరు పేరున అక్రమంగా రిజిస్టర్ చేశాడని ఆరోపించాడు.
పలుమార్లు అధికారులను కలిసి తన భూమి ని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని వేడుకున్నా పట్టించుకోలేదన్నాడు. కాలినడకన వెళ్లి హై దరాబాద్‌లో ప్రజావాణి కార్యక్రమంలో వి న్నవించినా ఫలితం లేదని వాపోయాడు. దీ ంతో ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగుల మందును తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు పరశురాముడిని ఆసుపత్రికి తరలించారు.