calender_icon.png 26 December, 2024 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుపై దుండగుల దాడి తీవ్ర గాయాలు

25-12-2024 12:00:00 AM

హుజూరాబాద్, డిసెంబర్ 24:  రైతుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా మారం వెంకట రాజిరెడ్డి అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. హుజురాబాద్ నియోజ కవర్గంలోని వినవంక మండలం హిమాయత్ నగర్ గ్రామంలో మంగళవారం సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకట రాజిరెడ్డి ఉద యనే మొక్కజొన్న చేనుకు నీళ్లు కడుతుండగా మాస్కులు ధరించి గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై ఎగదటిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108లో జమ్మికుంట ఆసుపత్రికి తీసుకెళ్లగా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన చేరుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.