ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్థిక అభివృద్ధిలో రైతు ఉత్పత్తి సంఘాలకే భవిష్యత్తు ఉంటుందని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా(ITDA PO Kushboo Gupta) అన్నారు. శనివారం రైతు ఉత్పత్తి సంఘాల లబ్ధిదారులకు మొదటి దశ చెక్కులను అందజేశారు. జై నూర్, రెబ్బెన మండలలకు చెందిన రైతు ఉత్పత్తి సంఘాలకు ట్రై కార్ ద్వారా మంజూరైన రూ.7.5 లక్షల చొప్పున రెండు సంఘాలకు చెక్కును అందజేశారు. వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగంలోనూ రైతులు అభివృద్ధి చెందాలని పిఓ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉద్యాన అధికారి సందీప్, సేర్ప్ అసిస్టెంట్ మేనేజర్ సుజాత, రైతు ఉత్పత్తి సంఘాల సభ్యులు వినోద్, ప్రశాంత్, ప్రజ్ఞశిల్, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.