calender_icon.png 16 January, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు రుణమాఫీ తెలంగాణ ప్రగతికి నాంది

19-07-2024 01:23:51 AM

మంత్రి సీతక్క 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): మాది రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని, అందుకే వరంగల్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హమీని నిలబెట్టుకున్నామని మంత్రి సీతక్క తెలిపా రు. లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే లక్ష జమకావడంతో వారంతా రుణ విముక్తులయ్యారని, దీంతో యావత్ తెలంగాణ రైతాంగం రుణమాఫీ పండగ చేసు కుంటోందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎనిమిది విడతల్లో మొక్కుబడిగా చేసిన రుణమాఫీతో రైతులు రుణ విముక్తులు కాలేదని, రైతులను బ్యాంకర్లు బ్లాక్ లిస్టులో పెడితే అవమానాలు ఎదుర్కొన్నారని, అందుకే ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీకి శ్రీకారం చుట్టి అన్నదాతకు అండగా నిలిచినట్లు చెప్పారు.

దేశ వ్యవసాయ చరిత్రలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు చిరస్థాయిలో నిలిచిపోనుందని తెలిపారు. ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విపక్షాలు సన్నాయి నొక్కులు నొక్కు తున్నాయని విమర్శించారు. రైతులకు రూపా యి లాభం చేయని బీజేపీ నేతలు కూడా చాలా మాటలు చెబుతున్నారని, బడా కంపెనీలకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వానికి రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు.