calender_icon.png 6 October, 2024 | 5:57 PM

రైతు రుణమాఫీ, రైతుబంధు పూర్తిస్థాయిలో అమలు చేయాలి

06-10-2024 03:21:57 PM

హుజూర్ నగర్ (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు జరిపి రైతుబంధు నగదును వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని సిపిఎం ఒకటవ శాఖ రెండవ శాఖ మహాసభల్లో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వెంటనే పూర్తిస్థాయిలో అమలు జరపాలని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ప్రజలకు రేషన్ కార్డు లేక పది సంవత్సరాలు అవుతుందని వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఇండ్లు, ఇండ్ల స్థలాలు అర్హులైన వారందికి ఇవ్వాలని ఆయన కోరారు. నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలవాలని అన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యలపై రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎడ్ల సైదులు, ఆనెగంటి మీనయ్య, ఎం రుద్రమ్మ, నీలా రామ్మూర్తి, వాస సంపత్, షర్టు శ్రీను, గుర్రం యేసు, పొనుగోటి శ్రీనివాసరావు, బుల్లి పెళ్లి శ్రీను,  వడ్లకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.