calender_icon.png 7 January, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పందుల కోసం అమరిస్తే మనిషిని బలిగొన్న విద్యుత్ తీగలు

06-09-2024 07:55:57 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): బజార్ హాత్నుర్ మండలంలో ఓ రైతు కూలీ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.  మండలంలోని మడ గూడ గ్రామ సమీపంలో పత్తి చేనులో శుక్రవారం కూలికి వెళ్తూన్న క్రమంలో పంట రక్షణకై అడవి పందుల కోసం అమర్చిన అక్రమ విద్యుత్ తీగలు తగిలి రైతు కూలి  కొడప గంగారాం మృతి చెందారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఐతే మృతునికి భార్య కొడప తులసి బాయి, కూతురు కొడప నాగమణి, కొడప సంగీత, కొడకు మనీష్  లు ఉన్నారు. విద్యుత్ ప్రమాదంలో కుటుంబ పెద్ద దుర్మరణం చెందడంతో మృతుని కుటుంబంలో విషాదం నెలకొంది.