calender_icon.png 12 January, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసాను వెంటనే అమలు చేయాలి

12-01-2025 12:00:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్

ఆదిలాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): అర్హులైన రైతులకు సంక్రాంతి లోపు సంపూ ర్ణ రుణమాఫీ చేసి, రైతు భరోసా అందించాలని, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జి  కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అందోళన నిర్వహించారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి హమీల అమలు చేయకుండా మోసం చేస్తుందని రామన్న ఆరోపించారు. రైతుభరోసాలో కొత్త నిబంధనలు అమలు చేయడం వల్ల చాలామంది రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే రూ.2 లక్షలు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం సగం మంది రైతులకు మాఫీ చేయలేదన్నారు. రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.