ఖమ్మం,(విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో రైతు తాటికొండ రామారావు మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామారావు 8 ఎకరాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. వరి నాటు పెట్టేందుకు బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ బోరు వద్దకు వెళ్ళి, మోటారును ఆన్ చేస్తుండగా, తెగిన సర్వీస్ వైరు చేతికి తగలడంతో షాక్‌తో కింద పడిపోయాడు. కూలీలు గమనించి, విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి, చూడగా, అప్పటికే రైతు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాధ చాయాలు అలుముకున్నాయి.