calender_icon.png 20 January, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నలారా.. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి: హరీశ్ రావు

06-09-2024 12:44:15 PM

హైదరాబాద్: రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్ కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసిందన్నారు. రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, ధైర్యాన్ని కోల్పోకండని హరీశ్ రావు కోరారు. 

బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి.. మీ తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని వెల్లడించారు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరని తెలిపారు. దయచేసి బాధ్యతగా వ్యవహరించండి. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు విషయంలో మీరు నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెలకావొస్తున్నది.  ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోండని హరీశ్ రావు సూచించారు.