24-03-2025 10:45:22 PM
కామారెడ్డి జిల్లా రాంపూర్ గడ్డలో ఘటన..
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తో ఓ రైతు విద్యుత్ వైర్లపైనే మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం... విద్యుత్ సబ్ స్టేషన్ నుండి ఎల్ సి తీసుకొగా గడ్ శీను (35), అనే రైతు అదే సమయంలో మరో వ్యక్తి ఎల్ సి అడగడంతో లైన్ బంద్ చేశారు. అయితే ఒకరి పని పూర్తి కావడంతో ఎల్ సి రిటర్న్ చేయడంతో కరెంట్ సరఫరా కావడం వల్ల రైతు శీను విద్యుత్ స్తంభం వైర్లపైనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ అధికారులు వచ్చి ఏదో ఒకటి సమస్య పరిష్కారం చేయాలని సబ్ స్టేషన్ వద్ద రైతులని ఉంచి నిరసన వ్యక్తం చేశారు. శ్రీను అనే రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.