calender_icon.png 25 March, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో రైతు మృతి..

23-03-2025 07:09:02 PM

పాపన్నపేట: విద్యుత్ షాక్ కు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల కేంద్రం పాపన్నపేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బట్టి బాలయ్య (57) పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కౌలు తీసుకున్న పొలం వద్ద బోరు మోటారు పని చేయకపోవడంతో దానిని రిపేర్ చేసేందుకు ఆదివారం పొలం వద్దకు వెళ్ళాడు. మోటారు స్టార్టర్ వద్ద రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య కిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.