calender_icon.png 12 March, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

12-03-2025 12:00:00 AM

రాజంపేట, మార్చి 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో తలమడ్ల గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్ రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందని ఎస్సు తెలిపారు. రాజంపేట ఎస్సు పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం..

తలమడ్ల గ్రామానికి చెందిన పెట్టిగాడి రామచంద్రం (61) మంగళవారం ఉదయం గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలంలో నీరు పారించడానికి బోర్ స్టాటర్ స్టార్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు.

పొలానికి వెళ్లిన అతను ఎంతసేపైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ప్రమాదవశాత్తు బోరుమోటారు వద్ద మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. మృతునికి  కూతురు, కుమారుడు  ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతోకేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సు పుష్పరాజ్ తెలిపారు.