calender_icon.png 5 March, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్ తో రైతు దుర్మరణం

04-03-2025 10:19:58 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కరెంట్ షాక్ తగిలి ఓ రైతు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పార్డి (కే) గ్రామానికి చెందిన ఉగ్గే హన్మంతు (50) తన పంట చేనులోని జొన్న పంటకు నీరు ఇచ్చేందుకు మంగళవారం సాయంత్రం సమయంలో చేను వద్దకు వెళ్ళాడు. ఐతే నీటి పంపు మోటర్ ఆన్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అకస్మాత్తుగా రైతు మృతి చెందడంతో వారి ఇంట్లో విషాదం నెలకొంది.