నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన రైతు సామ నిరంజన్(55) ఆదివారం తన పొలంలో మోటార్‌ను ఆన్ చేసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌వైరు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతిచెండాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.