calender_icon.png 8 January, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో రైతు మృతి

14-09-2024 01:43:18 PM

కామారెడ్డి (విజయక్రాంతి): పంట చేతికి వచ్చే సమయంలో పండిన పంటతో ఉన్న అప్పులు తీర్చుకొని తన కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించుకుందాము అనే సమయంలో విద్యుత్ షాక్ ఆ కుటుంబానికి యమపాశంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. తనకున్న వ్యవసాయ పొలం వద్ద మోటార్ వద్ద స్టార్టర్ చుట్టూ గడ్డి పేరుకపోయి ఉండడంతో అది తొలగించి వద్దామనుకునే సమయంలో వెంబడించింది.

తన వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై శనివారం ఉదయం యువరైతు మృతి చెందారు. గ్రామస్తులు స్థానిక ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముక్కిరి ఎల్లయ్య(41) తన వ్యవసాయ పొలం వద్ద గల బోరు మోటర్  స్టార్టర్ చుట్టూ ఉన్నటువంటి  గడ్డి కొడవలితో  కోస్తుండగా విద్యుత్ వైర్ ను గమనించకుండా కోయడంతో శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు విద్యుత్  షాక్  కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబసభ్యులు భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగిందని తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఉదయం అందరితో కలుపుగా మాట్లాడి పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి విద్యుత్ షాక్ గురై తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.