calender_icon.png 13 February, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులో పడి రైతు మృతి

13-02-2025 01:46:01 AM

నిజాంసాగర్ ఫిబ్రవరి 12 విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామంలో కంట్రపల్లి బాలయ్య (56) బుధవారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి, తూములోని మోటారు వాల్వు చెత్తతో మూసుకు పోయిందని చూసేందుకు ప్రయ త్నించాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో, దివ్యాంగుడైన బాలయ్య చెరువులో నుంచి బయటకు రాలేక మృతి చెందాడు. బాలయ్యకు భార్య అనుషవ్వ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య అనుషవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర శివకుమార్ తెలిపారు.