ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలలో విషాదం నెలకొంది. వాయి పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిమ్మన్ గూడ గ్రామంలో వ్యవసాయ బావిలో పడి రాథోడ్ ఈశ్వర్ (43) అనే రైతు మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శివరాం తెలిపిన వివరాల ప్రకారం... చిమ్మన్ గూడ గ్రామానికి చెందిన రైతు ఈశ్వర్ తన వ్యవసాయ చేనులో ఎడ్లను మోపి నీళ్లు తాగించేదుకు బావి వద్దకు తీసుకెళ్లిగా, ప్రమాదవశాత్తు కాలు జారీ బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల మృతి చెందారు. మృతుని కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ శివరాం తెలిపారు.