calender_icon.png 21 April, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ బావిలో స్నానానికి దిగి రైతు మృతి

21-04-2025 12:22:14 AM

పెబ్బేరు, ఏప్రిల్ 20 :  వ్యవసాయ బావిలో దిగిన ఓ రైతు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఘటన పెబ్బేర్ లో చోటుచేసుకుంది.  ఎస్త్స్ర యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గా పెబ్బేర్ పట్టడానికి చెందిన రైతు బుచ్చయ్య యాదవ్ (65) శనివారం సాయంత్రం పొలం పనులకు వెళ్లాడు. పనులు ముగించుకొని పట్టణ శివారులోనే జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో స్నానం చేయడానికి దిగాడు.

స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు  బావి లో మునిగి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం  వ్యవసాయ బావి యజమాని కుమారుడు బాలరాజు బావిలో మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బావిలో ఉన్న మృతదేహాని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు ఎస్త్స్ర తెలిపారు