calender_icon.png 14 November, 2024 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్‌షాక్‌తో రైతు మృతి

13-11-2024 01:07:38 AM

మునగాల, నవంబర్ 12: కరెంట్‌షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మునగాల మండలం తాడ్వాయి గ్రామంలో మంగళవారం జరిగింది. తాడ్వాయి గ్రామానికి చెందిన రైతు చిర్ర సైదులు(55) ధాన్యాన్ని ట్రాక్టర్‌లో నింపుకుని కలకోవ స్టేజీ సమీ పంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఆరబోసేందుకు తరలించాడు. ధాన్యంను అన్‌లోడ్ చేసేందు కు ట్రాలీ హైడ్రాలిక్‌ను పైకిలేపగా పైన ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో కరెంట్‌షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమా ర్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.