ఖమ్మం, అక్టోబర్ 5 (విజయక్రాంతి): వ్యవసాయ భూమిలో తెగి కిందపడిన కరెంట్ తీగలు తగిలి రై తు మృతి చెందిన ఘటన చింతకాని మండలం లచ్చగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెం దిన గూని ప్రసాద్(55) శనివారం పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా పొలంలో తెగిపడిన విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు.
రెండు రోజుల క్రితం వచ్చిన గాలివానకు విద్యుత్ వైర్లు తెగి కిందపడిన సంగతిని రైతు గ్రహించలేకపోయాడు. రైతు మృతికి విద్యుత్ అధికారులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమా ండ్ చేస్తూ కొదుమూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతు మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు