31-03-2025 11:09:59 PM
దిగుబడి రాదని పెట్టిన పెట్టుబడి నిండదని బెంగతో ఇంటి ముందు ఆత్మహత్యకు పాల్పడిన రైతు..
కామారెడ్డి జిల్లా పొందుర్తిలో ఘటన..
రాజంపేట (విజయక్రాంతి): వేసిన పంటకు దిగుబడి రాక మరోవైపు పంట ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాక, పంట కోసం తెచ్చిన అప్పు తీరదని కలత చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు రాజంపేట పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పొందుర్తి గ్రామానికి చెందిన రైతు తిరుగుడు స్వామి(36) కు పొందుర్తి గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వేసిన వరి పంట దిగుబడి రాక నీరు లేక పంట ఎండిపోయింది. దీంతో కలత చెందిన స్వామి సోమవారం ఇంటి ముందు గల హాలులో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రాజంపేట ఎస్సై పుష్పరాజు తెలిపారు. మృతుని భార్య పోచవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నట్లు ఎస్ఐ వివరించారు.