04-03-2025 12:07:47 AM
భీమదేవరపల్లి, మార్చి 3: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు రాచర్ల బక్కయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాచర్ల బక్కయ్య తండ్రి తన ముగ్గురు కుమారులకు ఒక్కొక్కరికి ఒక ఎకరం 6 గంటల భూమి ఇచ్చాడు కాగా బక్కయ్య ఆ సమయంలో డబ్బులు లేక పట్టా చేసుకోలేదు.
దీంతో ఆయన సోదరుని కుమారుడు మాజీ సర్పం రాచర్ల సారయ్య బక్కయ్య భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడు. మాజీ సర్పం రాచర్ల సారయ్యను బక్కయ్య ఎన్నిసార్లు వేడుకున్న బ్రతిమిలాడినప్పటికీ భూమి పట్టా చేయక పోడంతో తీవ్ర మనోవేదనకు గురైన బక్కయ్య క్రిమిసంహారక మందు తాగి వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.