కామారెడ్డి, నవంబర్ 5 (విజయక్రాంతి): అప్పుల బాధతో రైతు ఆత్మ హత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెంది రైతు టేకుల సాయిరెడ్డి(47) కుమారుడు ఇంటి నిర్మా ణం కోసం అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్థాపానికి గురైన సాయిరెడ్డి మంగళవా రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తా డ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.