11-03-2025 11:30:25 AM
చిట్యాల,(విజయక్రాంతి): పురుగుమందు తాగి ఓ రైతు(Farmer ) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని శాంతినగర్(Shanti Nagar village) గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు గ్రామానికి చెందిన మోత్కూరి కుమార్(41) మూడు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అయితే గత వారం రోజుల నుంచి మొక్కజొన్న పెరడి వద్ద అడవి పందులు, కోతుల బెడద వల్ల రాత్రిపూట అక్కడే నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి కూడా పంట చేనులో పడుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే మంగళవారం ఉదయం గ్రామ శివార్లలో రోడ్డు పక్కన కుమార్ నురుసులు కక్కుతూ విగత జీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కుమార్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య కవిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.